calender_icon.png 8 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించండి: డిప్యూటీ సీఎం భట్టి

07-04-2025 06:27:10 PM

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)లతో చర్చించిన అనంతరం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని డిప్యూటి సీఎం ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని భట్టి కోరారు. అలాగే ఉపసంహరణలో న్యాయపరమైనా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. సమస్యలు రాకుండా న్యాయశాఖ అధికారులు తగు సూచనలు చేయాలని తెలిపారు.