కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో మంగళవారం తెలంగాణ వైద్య మండలి బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇద్దరు చిర్నారులు మృతిచెందిన సంఘటన విధితమే.
అలాగే లింగంపేట మండల కేంద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థి పీఎంపీ వైద్యులు ఇచ్చిన మందుల డోస్ ఎక్కువై మృతిచెందాడు. ఈ మేరకు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ వైద్య మండల వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, సభ్యులు బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 30 ఆసుపత్రులపై దాడులు చేయగా 15 మంది నకిలీ వైద్యులను గర్తించి, కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.