ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
రాష్ట్రానికి ధర్మాసనం నోటీసులు
విజయవాడ, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, నారాయ ణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని, మాజీమంత్రి దేవినేని ఉమ, వ్యాపా రవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ పై కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారి ంచింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదు లైన సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసు లు జారీచేసింది. విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్మెంట్, మద్యం, ఏపీ ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇసుక మాఫి యా, ఇన్నర్‌రింగ్ ఆలైన్మెంట్‌లో అక్రమాల కేసు లు వారిపై ఉన్నాయని, వాళ్లే అధికారంలో ఉన్నందున సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాల ంటూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధ రతిలక్ పిల్ వేశారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నందునే పిల్ వేసినట్లు సీనియ ర్ అడ్వొకేట్ శ్రీపాద ప్రభాకర్ చెప్పారు. ఏడు కేసుల్ని సీబీఐ, ఈడీలకు బదిలీ చేయాలన్నారు. ఈ స్కాంల గురించి దర్యాప్తు చేసిన అధికారులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోం దన్నారు.
గత ప్రభుత్వం పెట్టిన కేసుల్ని సమీక్ష చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆయనే నిందితుడిగా ఉన్న కేసుల్ని ఆయనే సమీక్ష చేయడమంటే కేసుల్ని నీరుగార్చడమేనని చెప్పారు. ఇది పిల్ కాదని రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. పిటిషనర్‌కే సందేహాలు ఉన్నాయన్నారు. పత్రిక నడుపుతున్నామని చెప్పిన పిటిషనర్ ఎక్కడా సదరు పత్రిక సర్క్యులేషన్ వివరాలు ఇవ్వలేదన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు, పత్రిక నిర్వహించడాన్ని పక్కకు పెట్టండని, సామాన్యుడు కోర్టుకు రాకూడదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ, పిల్ విచారణార్హతపై కౌంటర్ వేస్తామని, పిల్ మెరిట్స్‌లోకి వెళ్లబోమని చెప్పారు. దీనిపై హైకోర్టు, పిల్ విచారణార్హతతోపాటు పిల్‌లోని అంశాలపైనా కౌంటర్ వేయాల్సిందేనని తేల్చి చెప్పింది. విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.