17-04-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కక్ష్య పూరితంగానే ఏఐసీసీ అగ్రనేతలపై కేసులు నమోదు చేస్తున్నారని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీ సీ, టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఐటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్ హెరాల్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోని యా గాంధీ, రాహుల్ గాంధీలను రాజకీయ కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.