calender_icon.png 5 December, 2024 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగంపై కేసు నమోదు

05-12-2024 01:09:58 AM

పరారీలో పంచాయతీ కార్యదర్శి

హుజూర్‌నగర్, డిసెంబర్ 4: సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామపంచాయతీకి ఓ సిమెంట్ కంపెనీ విరాళంగా ఇచ్చిన వాటర్ ట్యాంకర్ పోయిందంటూ జీపీ సిబ్బంది ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి.. మాజీ వార్డు సభ్యురాలి భర్త ఆరోగ్యరెడ్డి పేరున మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ట్యాంకర్‌ను లీజుకు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. 

ఈక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆరోగ్యరెడ్డిపై చీటింగ్ నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం కేసులో ఏ ఆరోగ్యరెడ్డి, ఏ శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఏ ఏ జ్యుడీషియల్ రిమాండ్‌లోకి తీసుకోగా పంచాయతీ కార్యదర్శి పరారీలో ఉన్నాడు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి కస్టడీ కోరు తూ పోలీసులు పిటిషన్ దాఖలు  చేయగా ఒకరోజుకు అనుమతి ఇస్తూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.