21-02-2025 11:02:54 PM
శంభాజీ మహారాజ్‌పై తప్పుడు కథనం..
ముంబై: చత్రపతి శంభాజీ మహరాజ్‌కు సంబంధించి వివాదాస్పద కంటెంట్‌ను తొలగించనందుకు గానూ నలుగురు వికీపీడియా ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీస్ విభాగం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వికీపీడియాలో ఆయా ఎడిటర్లు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు సంబంధించి తప్పుడు సమాచారం అందించినట్లు తేలడంతోనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారమే అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న సదరు వికీపీడియా సంస్థకు సైబర్ సెల్ నోటీసు ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 15 మెయిల్స్ పెట్టినప్పటికీ రిప్లు రాలేదు. దీంతో ఐటీ యాక్ట్ కింద సెక్షన్ 69, 79లు ఉల్లఘించినందుకు గానూ వికీపీడియాలో పనిచేస్తున్న నలుగురు ఎడిటర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన సంగతి తెలిసిందే.