calender_icon.png 15 November, 2024 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వకీల్‌సాబ్‌పై కేసు నమోదు

14-11-2024 12:01:35 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (విజయక్రాంతి): వకీల్‌సాబ్ చేతిలో దగా పడ్డ దళితులు బుధవారం నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశా రు. మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామానికి చెందిన బుషపాగ సుక్కమ్మ నాగనూలు గ్రామ శివారులో 3.26 ఎకరాల భూమిని కొ న్నాడు. తన ముగ్గురు తమ్ముళ్లు అందులో వాటా కావాలని ఒత్తిడి తెచ్చారు.

దీంతో వారంతా న్యాయం కోసం జిల్లా కేంద్రానికి చెందిన స్వామినాథ్ అనే న్యాయవాదిని ఆశ్రయించారు. వారిని నమ్మించిన స్వామినాథ్ 3.26 ఎకరాల భూమిని తనపేర రిజిస్ట్రేషన్ చే యించుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైతుబంధు రాకపోవడంతో ఆలస్యంగా తేరుకున్న బాధితులు స్వామినాథ్‌ను ప్ర శ్నించగా నల్లకోర్టును అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు. కాగా 3.26 ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమిని ఇతరులకు అమ్ముకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్వామినాథ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.