calender_icon.png 8 April, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి అక్రమణపై ఇద్దరిపై కేసు నమోదు

07-04-2025 11:29:46 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి షంషీర్ గర్ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు కట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ కౌన్సిలర్ మహబూబీ, ఆమె అల్లుడు అమానుల్లా ఖాన్ శంషిర్ నగర్ లోనీ ప్రభుత్వ భూమిని (Sy.No:170 PP)  ఆక్రమించి ఆ స్థలములో ఇల్లు నిర్మాణం చేపట్టారు.

ఈ విషయం తెలిసి బెల్లంపల్లి తహసిల్దార్ జోత్స్న రెవెన్యూ సిబ్బందిని పంపించి కూల్చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపై బెల్లంపల్లి 1-టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.