20-03-2025 10:57:00 PM
డబ్బులు డిమాండ్ చేయడంతో షాప్ యజమాని ఫిర్యాదు..
ఇద్దరిపై కేసు నమోదు చేసిన బిక్కనూర్ పోలీసులు..
కామారెడ్డి (విజయక్రాంతి): ఓ మోటార్స్ షాప్ లోకి వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు నకిలీ విలేకరులపై కేసు నమోదు చేసినట్లు బిక్కనూరు ఎస్సై ఆంజనేయులు గురువారం రాత్రి తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంకు చెందిన లింగాల నవీన్ గౌడ్ అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆన్లైన్ రిపోర్టర్ గా పరిచయం చేసుకుని మరొక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ గా చెప్పి బిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర మోటార్స్ షాపులోకి అక్రమంగా ప్రవేశించి అందులో పని చేస్తున్నటువంటి గడ్డం శ్రీలతను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి భయభ్రాంతులకు గురి చేయడంతో షాపు యజమానులు నిర్వాహకులు పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. వేరు గతంలో కూడా మోటార్స్ షాప్ కి వచ్చి తమను చూసుకోవాల్సి ఉంటుందని లేనియెడల ఇబ్బందులకు గురిచేస్తామని పలుమార్లు బెదిరించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ ఎస్సై డి ఆంజనేయులు తెలిపారు. నకిలీ విలేకరుల అసలువిలే కర్ల అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.