calender_icon.png 17 March, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జూనియర్ అసిస్టెంట్ పై దాడిలో పలువురిపై కేసు నమోదు

17-03-2025 06:22:09 PM

బైంసా (విజయక్రాంతి): ఆటోలో వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేసి నట్లు భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ తెలిపారు. బైంసా ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అబ్దుల్ వకీల్ సోమవారం దస్తావేజులను తీసుకొని తానూరు వెళ్తుండగా పలువురు యువకులు బోరేగాం గ్రామం వద్ద అతనిపై దాడి చేశారు. ఈ మేరకు అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అందులో నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ విషయంలో ఎవరు వీడియోలను పుకార్లను దుష్ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పమన్నారు.