calender_icon.png 23 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావ రంపై దాడి ఏడుగురిపై కేసు నమోదు

23-04-2025 12:48:13 AM

బిజినేపల్లి ఏప్రిల్22: మండల కేంద్రంలోని ఓఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చి న విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకొన్న ఘటన మంగళవారం బిజినపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది.

ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి బిజినేపల్లి గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచా రం మేరకు దాడి చేయగా నాగరాజుతో పా టు మరో ఆరుగురు కరిముల్లా బేగ్, శ్రీను, శ్రీకాంత్, అంజనేయులు, అనిల్, సూరిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.13,700 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.