calender_icon.png 1 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు

24-03-2025 11:23:15 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు బ్లూ కోర్టు విధులలో భాగంగా సోమవారం ఖానాపూర్ పట్టణం అంబేద్కర్ నగర్ గ్రామ శివారులో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన మొగల్పుర కాలనీకి వాసులు మొహమ్మద్ మజాహర్ అనే వ్యక్తి, వాహనాలకి సరైన ధ్రువపత్రాలు లేకపోగా పోలీస్ వారిపై దురుసుగా ప్రవర్తించినందుకు, ఫిర్యాదిదారి మేకల సుధీర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనాలు నడిపే యజమానులు, వాహన పత్రాలు, హెల్మెట్ తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని, ధరించాలని, వెహికల్ చెకింగ్ విధులలో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఎస్సై తెలిపారు.