03-03-2025 12:42:35 AM
ముంబై, మార్చి 2: సెబీ మాజీ చైర్ పర్స న్ మాధబీ పూరీ బచ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్ద ఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సవన్ శ్రీవాత్సవ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సెబీ మాజీ చీఫ్ మాధబీ పూరీ బచ్ సహా ఐదుగురు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేం జ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సవాలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబీ ప్రకటించింది.