ఘట్ కేసర్,(విజయక్రాంతి): డీజే సౌండ్ తో డ్యాన్స్ లు చేస్తూ న్యూసెన్స్ సృష్టించి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్న కాంటినెంటల్ ఫాం హౌజ్ యజమాన్యంతోపాటు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసిన సంఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు స్టేషన్ పరిధి అంకుషాపూర్ లోని కాంటినెంటల్ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి డీజే పెట్టి పెద్ద శబ్దంతో డాన్స్ లు చేయటంతో పాటు న్యూసెన్స్ చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాంటినెంటల్ ఫామ్ హౌజ్ పైయజమాని ఆకాష్, మేనేజర్ సుధీర్, డీజే నిర్వహకులు అంజన్ కుమార్, ఆఫరేటర్ లోకేశ్వర్, నిర్వహకులు వరుణ్, వికాష్ లపై కేసు నమోదు చేయటంతో పాటు డీజే సౌండ్ సిస్టం ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నుట్లు పోలీసులు తెలిపారు.