calender_icon.png 19 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఘోరినిపై మోకిలా పీఎస్‌లో కేసు నమోదు

16-04-2025 12:23:24 AM

చేవెళ్ల, ఏప్రిల్ 15 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన అఘోరిని (శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అలియాస్ శ్రీనివాస్) మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ మహిళ కోసం పూజలు నిర్వహించిన అఘోరిని.. ఒప్పందం చేసుకున్న దానికన్నా ఎక్కువ  డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మంగళవారం మోకిలా సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్ర కారం.. శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ రెవెన్యూలోని ప్రగతి రిసార్ట్ లో నివాసముంటున్న సునితా బీటీ..

అఘోరి మాతను సంప్రదించి వ్యక్తిగతంగా ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించుటకు రూ.9 .80 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.  పూజ పూర్తయిన అనంతరం నగదు ముట్టజెప్పింది.  అయితే అఘోరి మరికొంత నగదు డిమాండ్ చేయడంతో భయపడిన వినితా బీటీ గత ఫిబ్రవరి నెలలో మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు  వివరా లు గోప్యంగా ఉంచాచాలని కోరడంతోనే తాము వివరాలు వెల్లడించలేదని సీఐ తెలిపారు.