calender_icon.png 27 December, 2024 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటినెంటల్ ఫాంహౌజ్ యాజమాన్యంపై కేసు

28-10-2024 12:04:55 AM

l డీజే సౌండ్ సిస్టమ్ స్వాధీనం

ఘట్‌కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): డీజే సౌండ్‌తో డ్యాన్స్‌లు చేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫాంహౌజ్ యజమాన్యంతో పాటు ప్రోగ్రామ్ నిర్వాహకులపై కేసునమోదు చేసిన ఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలిపిన ప్రకారం అంకుషాపూర్‌లో ఉన్న కాంటినెంటల్ ఫాం హౌజ్‌లో శనివారం రాత్రి డీజే సౌండ్‌తో న్యూసెన్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ్థస్థానికులు ఫిర్యాదు చేశారు.

దీంతో కాంటినెంటల్ ఫాంహౌజ్ యజమాని ఆకాశ్, మేనేజర్ సుధీర్, డీజే నిర్వహకులు అంజన్ కుమార్, ఆపరేటర్ లోకేశ్వర్, నిర్వహకులు వరుణ్, వికాస్‌లపై కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు.