calender_icon.png 31 October, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చ్ ఫాదర్‌పై హత్యయత్నం కేసులో 18 మందికి జరిమాన

13-09-2024 08:27:45 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ వేములవాడ సబ్ జడ్జి రాధికా జైశ్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించారని వేములవాడ పట్టణ ఇన్స్ పెక్టర్ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలోని చర్చ్ లో ఫాదర్ గా పని చేస్తున్న బ్రదర్ సువర్ణ పాల్ పై అదే చర్చ్ లో ఫాదర్ గా పని చేసి తొలగించబడిన తిమేతి అనే వ్యక్తి తనను తీసివేయడానికి కారణం అని అతనిని చర్చ్ నుండి ఎలాగైనా కాళీ చేపించాలని 2015 సంవత్సరం లో అక్రమంగా తన అనుచరులు 17 మందితో కలసి  బ్రదర్ సువర్ణపాల్ పై హత్యప్రయత్నం చేశారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైశ్వాల్ తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు.