రూ.9,100 విలువైన మాంజా సీజ్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (విజయక్రాంతి): నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ అబ్దు ల్ రెహమాన్ హెచ్చరించారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం పట్టణంలో నిషే ధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి, రూ. 9,100 విలువైన మాంజాను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు కొత్తగూ డెంలోని పెద్దబజారులో చైనా మాం జా విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు 3టౌన్ సీఐ కే శివప్రసాద్, ఎస్‌ఐ పురుషోత్తం, మ స్తాన్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారన్నారు. పెద్దబజార్‌లోని పవన్ టాయ్స్ షాప్‌లో 30 మాంజా బండిల్స్, 10 త్రెడ్‌రోల్స్, పవన్ జనర్ మర్చెంట్‌లో 14 మాం జా బండిల్స్ లభించినట్లు చెప్పారు. వాటిని సీజ్ చేసి కండెవాల పవన్, బ్రిజ్ కిశోర్ సాహూలపై కేసు నమో దు చేసినట్లు పేర్కొన్నారు.