calender_icon.png 24 November, 2024 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిమంది నకిలీ వైద్యులపై కేసు

24-11-2024 02:02:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తెలంగాణ వైద్య మండలి అధికారులు 10 మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేశారు. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లోని 20 క్లినిక్‌లలో వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు డాక్టర్ ఇమ్రాన్ ఆలీ, కోఆప్షన్ సభ్యులు డాక్టర్ రాజీవ్ సోదాలు నిర్వహించారు.

నకిలీ వైద్యులుగా గుర్తించిన వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ఆసుపత్రిలో లాగా బెడ్స్ ఉంచడం, స్లున్స్ పెట్టడం, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వీరిపై ఎన్‌ఎంసీ యాక్ట్ 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మహిళా ఆయుర్వేదిక్ వైద్యురాలు డాక ్టర్ రాధాకుమారిగర్భిణులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఆల్లోపతి మందులు ఇస్తున్నట్టు గుర్తించారు.

ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమేశ్, డాక్టర్ వీరేశ్ హై డోస్ యాంటీబయోటిక్, స్టెరాయిడ్స్ ఇతర అల్లోపతి మందులు ఇస్తున్నట్టు గుర్తించారు. వీరిపై ఆయుష్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా ఆరోగ్య వైద్యాధికారికి ఫిర్యాదు చేస్తామని టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఇమ్రాన్ ఆలీ తెలిపారు. నకిలీ వైద్యులైన  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.