12-02-2025 12:32:10 AM
కూసుమంచి, ఫిబ్రవరి 11: కల్లు అమ్ముకునే విషయంలో జరిగిన గొడవల ను మనసులో పెట్టుకొని కల్లులో పురుగుల మందు కలిపిన ఘటన మండలంలో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామానికి మొక్క వీరబాబు , అదే గ్రామానికి చెందిన ఐతగాని రమేష్ ఇద్దరు గ్రామంలోనే తాటి చెట్లు ఎక్కుతూ కల్లు అమ్ముకుంటున్నారు..
ఇద్దరి మధ్య కల్లు అమ్ముకునే విషయంలో గొడవలు జరిగాయి. గొడవ మనసులో పెట్టుకున్న ఐతగాని రమేష్ ఎలాగైనా మొక్క వీరబాబు ను నష్టపర్చాలని ఈనెల 6వ తేదీన వీరబాబు గీస్తున్న తాటి చెట్టును రాత్రి సమ యంలో ఎక్కి మూడు లోట్లలోనీ కల్లులో పురుగులమందు కలిపాడు..
రోజూలాగే ఉదయం తాటి చెట్టు ఎక్కిన వీరబాబుకు పురుగుల మందు వాసన రావడంతో అను మానం వచ్చి తనకు రమేష్‌కు గొడవలు అవుతున్న నేపథ్యంలోనే పురుగుల మందు కలిపి ఉండొచ్చు అని స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు.. ఫిర్యాదుదారుడికి తనకి మధ్య గొడవల కారణంగా కల్లులో పురుగు ల మందు కలిపినట్టు నిందితుడు రమేష్ ఒప్పుకున్నాడు.. నిందితుడిపై కేసు నమో దు చేసి రిమాండ్ కు తరలించారు.