వనపర్తి టౌన్, ఫిబ్రవరి 1 : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ -XI విడుతలో వనపర్తి జిల్లా వ్యాప్తంగా 71 మంది బాలలను గుర్తించి వారి తల్లిదం డ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వ హించడం జరిగిందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 08 మంది యజమానులపై కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. వనపర్తి జిల్లా పరిధిలో ప్రతి డివిజన్ పరిధి లో ఒక ఎస్సై మరియు నలుగురు సిబ్బం దిని ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి ప్రభు త్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్త తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిం దన్నారు