calender_icon.png 28 January, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలపై కేసు కొట్టివేత

25-01-2025 01:43:07 AM

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పాతబస్తీలో అనుమతుల్లేకుండా మీడియా సమావేశం నిర్వహించారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాలు పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలపై పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. తమపై కేసు కేట్టివేయాలని బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ అధికారిక చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని రాష్ట్రప్రభుత్వం తొలగించేందుకు యత్నిస్తున్నందున బీఆర్‌ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారన్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ నేతలు మహమ్మద్ సలావుద్దీన్, మీర్ ఇనాయత్ అలి బక్రి, మాగంటి గోపినాథ్, ఆశిశ్‌కుమార్ యాదవ్, పి.శ్రీకాంత్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.

అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను నేతలు ఉల్లంఘించకపోయినా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేశారు.