బెల్లంపల్లి, అక్టోబర్ 24: యూట్యూబర్ చిలుక ప్రవీణ్‌పై తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దైనట్టు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లికి చెందిన సింగతి నరేందర్, సింగతి మల్లేశ్ భూవివాదం కారణం గా కొట్టుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. ఈ ఘటనను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చే శారు.
దీనిని యూట్యూబర్ చిలుక ప్రవీణ్ వక్రీకరించి బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసినందుకే కాంగ్రెస్ వర్గానికి చెందిన వ్యక్తులు నరేందర్‌పై గొడ్డలి తో దాడి చేశారని తప్పుగా ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. అసత్య ప్రచా రం చేస్తున్న ప్రవీణ్‌పై తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.