అంబులెన్స్‌లో ఉత్సవానికి వచ్చినందుకు పోలీసుల చర్యలు!
న్యూఢిల్లీ, నవంబర్ 3: కేంద్రమంత్రి సురేశ్ గోపిపై కేసు నమోదైంది. ఈ యేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో త్రిస్సూర్ నుంచి పోటీచేసిన సురేశ్ గోపి.. కేరళలోని ప్రసిద్ధమైన ఉత్సవానికి అంబులెన్స్‌లో వచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఎట్ట కేలకు పోలీసులు ఈ విషయమై ఆయనపై కేసు నమోదు చేశారు.
సాక్షాత్తు ఒక కేంద్రమంత్రి ఉత్సవాలకు ఇలా అంబులెన్స్‌లో రావడం ఏంటీ అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనకు సహాయం చేసేందుకే త్రిస్సూర్ పూరం ఉత్సవానికి అంతరాయం కలిగించారని స్థానికులు మండిపడ్డారు. అప్పటినుంచి దీనిపై వివాదం నడుస్తుండగా తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాను పూరం ఉత్సవాలకు అంబులెన్స్‌లో వెళ్లలేదని, సొంత కారులోనే వెళ్లినట్లు గోపి స్పష్టం చేస్తూ ఆరోపణలను ఖండించారు.