calender_icon.png 10 January, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచ్ ప్రభాకర్‌పై కేసు

07-11-2024 01:19:05 AM

  1. మరో ఇద్దరిపైనా కేసులు నమోదు

విజయవాడ, నవంబర్ 6: ప్రముఖ యూట్యూబర్ పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు.

పంచ్ ప్రభాకర్ తన యూట్యూబ్‌లో సీఎం, డిప్యూటీ సీఎంలను అసభ్యంగా తిడుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. దీంతో విజయవాడకు చెందిన రాజు అనే వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ప్రభాకర్‌పై ఫిర్యాదు చేయడంతో ‘పంచ్’పై  పోలీసులు కేసు నమోదు చేశా రు.

అలాగే సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా(ట్విట్టర్)లో పోస్టింగ్ చేసిన బాయిజయంతి అనే వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు. మొగల్రాజపురానికి చెందిన సాదిరెడ్డి శ్రీనివాస్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదు చేశారు

కాగా ట్విట్టర్(ఎక్స్)లో పవన్ కల్యాణ్‌ను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాత పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు రాధాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.