11-02-2025 12:00:00 AM
పెన్ పహాడ్, ఫిబ్రవరి 10 : వ్యవసాయ క్షేత్రాల వద్ద అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తిపై పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మండల పరిధిలోని జల్మాలకుంట తండా లో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన ప్రకారం.. తండాలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తుండ గా దాడులు నిర్వహించి.
నాటుసారా తయారీకి సంబదించిన 40 లీటర్ల బెల్లం పానకం, బెల్లం స్వాధీనం చేసుకొని పాన కం పరబోసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎవరై నా అక్రమంగా నాటు సారాయి అమ్మకా లు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్ప వన్నారు. దాడుల్లో సిబ్బంది ప్రవీణ్, లింగ రాజు, రామాంజనేయులు, సాయిలు ఉన్నారు.