calender_icon.png 26 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంభాల్’ హింసలో ఎంపీపై కేసు

26-11-2024 01:49:38 AM

మరో 400 మందిపైనా కేసులు నమోదు 

20 మంది అరెస్ట్.. విద్యాసంస్థలు బంద్

ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

లక్నో , నవంబర్ 25:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో ఆదివారం అధికారులు చేపట్టిన మసీద్‌పై సర్వే హింసకు దారి తీసి, నలుగురు పౌరులు మృతిచెందగా, సుమా రు 30 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. హింసపై రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ముం దస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

పోలీసులు  ఇప్పటివరకు 25మందిని అదుపులోకి తీసుకున్నా రు. 400 మందిపై కేసులు నమోదు చేశా రు. హింస వెనుక ఎస్పీ నేత, ఎంపీ జియావుర్ రెహమాన్, సంభాల్ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావించి వారిపైనా కేసులు పెట్టారు. 

కారణం పోలీసులే: అఖిలేశ్ యాదవ్

ఎంపీ జియావుర్ రెహమాన్‌పై కేసు నమోదు కావడంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘హింస జరిగినప్పుడు సంభాల్‌లో ఎంపీ లేరని, రాష్ట్రప్రభుత్వం కావాలనే ఆయన్ను కేసులో ఇరికిస్తున్నద’ని ఆరోపించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ సామాన్యులపై రాళ్లు రువ్వారని, ఫలితంగా నలుగురు పౌరులు మరిణించారని, పలువురు గాయపడ్డారని అన్నారు. 

అధికారం అందుకేనా? : రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘సంభాల్ ఘటన నన్ను కలచివేసింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతోనే హింస చెలరేగింది. ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది అల్లర్లు సృష్టించేందుకేనా? దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల మధ్య మతాల చిచ్చు పెడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.