హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే టీ రామ్మో హన్‌రెడ్డితో పాటు మరో కాంగ్రెస్ నేత ఏ సుధాకర్‌రెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును మంగళవారం హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2018 మార్చి 12న వికారాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎలాంటి అనుమతు ల్లేకుం డా టీ రామ్మోహన్‌రెడ్డి, ఏ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. వారు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిం చారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీనిపై దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసుపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు లో విచారణ కొనసాగుతోంది.
కేసును కొ ట్టివేయాలంటూ ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఏ సుధాకర్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచా రణ చేపట్టి కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.