calender_icon.png 5 December, 2024 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు

05-12-2024 12:40:28 AM

విధులకు ఆటంకంపై సీఐ ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధ వారం తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ సృష్టించారు. తాను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని  సీఐ రాఘవేంద్రతో వాగ్వాదానికి దిగారు. సీఐ పనిమీద బయటకు వెళ్తుండగా ఎమ్మెల్యే ఆయన్ను అడ్డుకున్నారు.

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సీఐ సంగతి చూస్తానన్నారు. సీఐ దీంతో  ఎమ్మెల్యే, ఆయన 20 మంది అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని, తాను వెళ్లకముందే ఏసీపీ బయటకు వెళ్లిపోయారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయం లో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని కోరగా, ఆయ న నిరాకరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.