హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన విధులను అడ్డగించి బెదిరించారని ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో సహ 20 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వెళ్ళాడు.
ఆయన వచ్చే సమయానికి సీఐ రాఘవేంద్ర అత్యవసర పని మీద బయటకు వెళ్లున్నారు. కౌశిక్ రెడ్డి తన ఫిర్యాదు తీసుకొని వెళ్లాలని పట్టుబట్టారు. దీంతో తను తిరిగి వచ్చాక ఫిర్యాదు తీసుకుంటానని సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి వినకపోగా, సీఐ కారు వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో సీఐ కారు దిగ్గి వస్తున్న సమయంలో కౌశిక్ రెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా సీఐ కేసు నమోదు చేశారు.