* పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై సీరియస్
నాగర్‌కర్నూల్, జనవరి 16 (విజయక్రాంతి): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి అచ్చంపేటలోని భ్రమరాంబిక ఆలయం వద్ద జరిగిన తోపులాటలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.
ఉ ఆలయ జాతర ప్రారం నేపథ్యంలో అచ్చంపేటలోని భ్రమరాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ప్రభ ఉత్సవాన్ని జరపడం ఆనవాయతీగా వస్తోంది. దీనికి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే పూజల్లో పాల్గొనాల్సి ఉంది. ఆలయ నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇతర ప్రముఖులకు ఆహ్వానం పంపారు.
కాగా బుధవారం రాత్రి ఎమ్మెల్యే వంశీకృష్ణ పూజలు నిర్వహిస్తున్న క్రమం మాజీ ఎమ్మెల్యే కూడా తన అనుచరులతో ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందన్న ఉద్ధేశంతో పోలీసులు వారిని కాసేపు నిలువరించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీ కేసు నమోదు చేశారు.