హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కరీంనగర్‌లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సోమవారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. శాసనసభలో సీనియర్ నేతగా చెప్పుకునే హరీశ్‌రావు.. సీఎంపై ఇస్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణలో తిరగనీయమని హెచ్చరించారు. పోలీసులు హరీశ్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.