18-03-2025 12:00:00 AM
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పంజాగుట్ట పోలీసుల చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు పంజాగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. 11 మంది యూట్యూబ్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై సోమవారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేష్యాని సుప్రిత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది.