calender_icon.png 22 December, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

13-09-2024 10:15:51 AM

హైదరాబాద్: పోలీసు అధికారిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 132, 351(3) కింద కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై గురువారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడినందుకు ఆరెకపూడి గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కమిషనరేట్‌కు వెళ్లగా ఎమ్మెల్యే, ఫిర్యాదుదారు పోలీసు అధికారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.