calender_icon.png 11 April, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఐటీ సెల్‌పై కేసు

04-04-2025 12:00:00 AM

  • హెచ్‌సీయూలో ఆందోళనల వేళ నకిలీ వీడియోలు! 

కొంతం దిలీప్, మన్నె క్రిశాంక్‌లపై కేసు 

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3: బీఆర్‌ఎస్ ఐటీ సెల్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హెచ్‌సీయూలో టీజీఐఐసీ చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల వన్యప్రాణులు చనిపోతున్నాయని తప్పుడు వీడియోలు ప్రచారం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు చేస్తున్నారని బాగన్నగారి అరుణ్‌దవాజ్ రెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో హెచ్‌సీయూలో ఆందోళనల వేళ నకిలీ వీడియోలు వైరల్ చేశారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొంతం దిలీప్, మన్నె క్రిశాంక్‌లపై కేసు నమోదు చేశారు. హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు.