calender_icon.png 27 January, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్కో కేటీఆర్.. ఇది ఆరంభం మాత్రమే

27-01-2025 12:45:52 AM

* సంక్షేమ పథకాలు చూసి బీఆర్‌ఎస్‌లో అలజడి

* డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

* పలు గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసిన మంత్రులు

విజయక్రాంతి నెట్‌వర్క్, జనవరి 26: “కాస్కో కేటీఆర్.. ఇది ఆరంభం మాత్రమే. నువ్వు.. నీ పార్టీ మా ప్రభుత్వ ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రవాహంలో  కొట్టుకుపోవడం ఖాయం” అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో  ఆదివారం ఆయన నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి, మాట్లాడారు.

కేటీఆర్ పరివారం కేవలం భ్రమల్లోనే బతుకుతుందని అన్నారు.  ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభించడంతో బీఆర్‌ఎస్ నేతల గుండెల్లో  అలజడి ప్రారంభమైంద న్నారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లు ప్రజలు గురించే ఆలోచన చేయలేదన్నారు.

కొందరు సొంత భావజాలాన్ని   ప్రజలపై రుద్దాలని  ప్రయత్నిస్తున్నారని,  గతంలో రాజ్యాంగాన్ని మారుస్తామంటూ  కేసీఆర్ మాట్లాడితే  తగుదనమ్మా అని  ఆయన కొడుకు అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్య బట్టారు. నాలుగు గోడల మధ్య గడీల్లో కూర్చొని  లబ్ధిదారులను ఎంపిక చేశారని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల మధ్యనే గ్రామసభల్లో లబ్ధిదారులను  ఎంపిక చేస్తున్నామని చెప్పారు.

ఎన్నికుట్రలు చేసినా ప్రజా సంక్షేమం ఆగదన్నారు. ప్రపంచంలో  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ప్రపంచంతో పోటీ పడేలా ఎదిగేందుకు మన రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందని అన్నారు. నాలుగు పథకాల కింద సంవత్సరానికి ప్రజలకు రూ.45 వేల కోట్లు అందించనున్నట్టు తెలిపారు.

అర్హులందరికీ పథకాలు: పొంగులేటి

కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రతి పథకం అందుతుందని ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలోని హసన్‌పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామాల్లో మంత్రి కొండా సురేఖతో కలిసి సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

సంక్షేమ పథకాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు జాబితాలో పేర్లు రాలేదని కంగారు పడుతున్నారని, అర్హులైన ప్రతీఒక్కరి దరఖాస్తును నిరంతరంగా స్వీకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కెఆర్ నాగరాజు పాల్గొన్నారు.

పేదలకే సంక్షేమ పథకాలు: దామోదర

పేద ప్రజల సమస్యల పరిష్కా రానికి, సంక్షేమ పథకాలు అంద జేసేం దుకు ప్రభు త్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని  నేరేడి గుంట, పుల్కల్ మండలంలోని ఈసో జుపేట గ్రామంలో  సంక్షేమ పథ కాలను ప్రారంభించి, మాట్లాడారు. 

పథకాలు అనర్హులకు చేరొద్దు: తుమ్మల

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం రఘునాధపాలెం మండలం మల్లెపల్లి గ్రామంలో నాలుగు పథకాలను ప్రా రంభించి, మాట్లాడారు. సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా చూడా లని అధికారులను ఆదేశించారు.