గట్టి పోటీనిచ్చిన ప్రజ్ఞానంద, గుకేశ్
బుకారెస్ట్ (రొమేనియా): సూపర్‌బెట్ క్లాసికల్ చెస్ టోర్నీ విజేతగా అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరూనా నిలిచాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఆర్. ప్రజ్ఞానం ద, దొమ్మరాజు గుకేశ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ టైబ్రేక్‌లో ఫలితం సాధించిన కరూనా తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. తొలుత కరూనా నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరీ చేతిలో ఓటమి చవిచూశాడు. ఇదే సమయంలో ప్రజ్ఞానంద ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజాతో, గుకేశ్ అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లేతో మ్యాచ్‌లను డ్రా చేసుకున్నా రు. దీంతో కరూనా, ప్రజ్ఞానంద, గుకేశ్‌లతో పాటు అలీరెజా ఫిరౌజా 5 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఈ నలుగురి మధ్య టైబ్రేకర్ మ్యాచ్ అనివార్యమైంది. ఫోర్ వే థ్రిల్లర్ టై బ్రేకర్‌లో ఒత్తిడిని అధిగమించి మూడు ర్యాపిడ్ గేమ్స్ నెగ్గిన ఫాబియానో కరూనా విజేతగా అవతరించాడు.