calender_icon.png 19 January, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్-65పై బారులుదీరిన కార్లు

19-01-2025 01:17:10 AM

  1. చౌటుప్పల్‌లో ట్రాఫిక్ రద్దీ
  2. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు అదనపు టోల్‌బూత్‌లు 

నల్లగొండ, జనవరి 18 (విజయక్రాంతి): సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెలకు వెళ్లిన వారు తిరుగుముఖం పట్టారు. దీంతో జాతీయ రహదారి-65పై శనివారం హైదారాబాద్ వైపు ట్రాఫిక్ రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజాలో మొత్తం 16 టోల్ బూత్‌ల్లో హైదరాబాద్ వైపు 12 బూత్‌లు తెరిచారు.

చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు వెంట డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదించాయి. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, నార్కెట్‌పల్లి రహదారిపై మాడుగులపల్లి సమీపంలోని టోల్‌ప్లాజాల్లో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం అదనపు టోల్‌బూత్‌లు కేటాయించనున్నట్లు నిర్వా  తెలిపారు.