calender_icon.png 9 March, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించండి

07-03-2025 12:32:43 AM

మహబూబ్ నగర్, మార్చి 6 (విజయ క్రాంతి) : అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా చేస్తూ ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,  సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎల్‌ఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో లబ్ధిదారులు ఉపయోగించుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 31190 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తూ అందరికి సమాచారం అందించి, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను లబ్ధిదారులు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓలు, తదితరులు ఉన్నారు.