పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 ( విజయక్రాంతి) : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలయ్యే విధంగా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను ఉద్యోగ సంఘాలు కలిసి విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించాలని ఉద్యో గ సంఘం నాయకులు కోరారు.
మహేష్‌గౌడ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మంగళవారం కలిసి, వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్, వెంకటేశ్, బాల స్వామి, చంద్రకాంత్, కృష్ణరావు, భూమన్న తదితరులు పాల్గొన్నారు.