3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): విజయవాడ మార్గంలో గరికపాడు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది సరుకు లారీలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి వెళ్లేందుకు మరో దగ్గరి మార్గం లేక లారీ డ్రైవర్లు వేచి చూస్తున్నారు. మరోవైపు కోదాడకు చేరుకున్న వాహనాలను పోలీసులు మిర్యాల గూడ వైపునకు మళ్లిస్తున్నారు. కోదాడ నుంచి విజయవాడకు వెళ్లేందుకు వాహనదారులు కోదాడ వైపు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌కు రవాణా పునరుద్ధరణ
భారీ వరదలకు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. దాదాపు 30 గంటల తరువాత ఎన్‌హెచ్ 65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త వంతెన మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. వాహనదారులు వంతెనపై నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.