calender_icon.png 22 September, 2024 | 4:55 AM

ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్ వర్కర్ ఉద్యోగాలు

22-09-2024 12:00:00 AM

దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ విజ్ఞప్తి

విదేశీ ఉద్యోగాలకు ప్రత్యేక డ్రైవ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజ యక్రాంతి): ఇజ్రాయెల్ దేశంలో కేర్‌గివర్ వర్కర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌లో విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్టు పే ర్కొంది.  కేర్‌గివర్ ఉద్యోగానికి దరఖా స్తు చేసుకోవడానికి 25 ఏళ్లలోపు ఉండి, జీఎన్‌ఎం/ఏఎన్‌ఎం డిప్లొమా, కేర్‌గివర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు అర్హులు అని స్పష్టం చేసిం ది. ఈ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు నెలకు రూ. 1,30,000 జీతం లభించనున్నట్టు పేర్కొంది. సమాచారం కోసం 8247838789/ 8019459 189/7893566493 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.