calender_icon.png 17 January, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి అగర్వాల్‌కు రజతం

11-09-2024 12:00:00 AM

జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్

మంగళూరు: 77వ సీనియర్ జాతీయ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన మహిళల 400 మీ ఫ్రీస్టుల్ విభాగంలో అగర్వాల్ రజత పతకంతో మెరిసింది. వృత్తి గమ్యాన్ని (4 నిమిషాల 25.09 సెకన్లు) పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా.. హర్షిత రామచంద్ర (4 నిమిషాల 24.70 సెకన్లు) పసిడి సొంతం చేసుకోగా.. భవ్య సచ్‌దేవా (4 నిమిషాల 30.94 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది. మహిళల 200 మీ బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో తాన్య (2 నిమిషాల 40.54 సెకన్లు), 100 మీ బ్యాక్‌స్ట్రోక్‌లో మోండల్, మహిళల 50 మీటర్ల బటర్ ఫ్లు విభాగంలో మహి స్వేత్‌రాజ్ (28.33 సెకన్లు) స్వర్ణాలు దక్కించుకున్నారు.

ఇక పురుషుల 400 మీ ఫ్రీస్టుల్‌లో అనీష్ గౌడ (3 నిమిషాల 56.59 సెకన్లు) స్వర్ణం సాధించగా.. దర్శన్ (4 నిమిషాల 1.39 సెకన్లు) రజతం, దేవాన్ష్ మహేశ్‌కుమార్ (4 నిమిషాల 1.39 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల 200 మీ బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ధనుష్ సురేశ్ (2 నిమిషాల 18.85 సెకన్లు) స్వర్ణం నెగ్గగా.. మణికంఠ, అనూప్ అగస్టీన్ రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. పురుషుల 100 మీ బ్యాక్‌స్ట్రోక్‌లో ఆకాశ్ మణి (56.15 సెకన్లు), పురుషుల 50 మీటర్ల బటర్ ఫ్లు ఈవెంట్‌లో రోహిత్ (24.22 సెకన్లు), పురుషుల 4x200 మీటర్ల ఫ్రీస్టుల్ విభాగంలో అనీశ్ గౌడ, దర్శన్, కార్తికేయన్, దక్షన్ బృందం (7 నిమిషాల 42.90 సెకన్లు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.