calender_icon.png 2 March, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలి

01-03-2025 10:10:25 PM

కడ్తాల్,(విజయక్రాంతి): గౌతమ ఫౌండేషన్, ఆయిస్టర్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా శనివారం జిల్లా పరిషత్ ముచ్చర్లలో పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌతమ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రజనికాంత్ మాట్లాడుతూ పదవ తరగతి అనేది జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తొలిమెట్టు వంటిదని పదవ తరగతి తర్వాత ఎంచుకోబోయే కళాశాల, గ్రూపులా విషయంలో విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలని, ఒత్తిడికి మరియు ఇతరుల ప్రలోభాలకు లోను కాకుండా సరైన నిర్ణయం తీసుకొని నచ్చిన విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ఉపాద్యాయుడు విజయ్ కుమార్ రెడ్డి,  ఆయిస్టర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామకృష్ణ,  ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.