కామారెడ్డి (విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కాల్చే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. బుధవారం అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. టపాకాయలు కొనే ముందు కూడా నాణ్యత గలవి కొనుగోలు చేయాలని సూచించారు. లైసెన్సు కలిగిన వ్యాపారుల వద్దనే టపాకాయలు కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రజల మధ్యన టపాకాయలు కాల్చవద్దని కాలి స్థలంలో కాల్చాలని సూచించారు. టపాకాయలు కాల్చే ముందు చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. టపాకాయలు కాల్చిన తర్వాత మళ్లీ పాత వాటిని కాల్చవద్దని తెలిపారు.
టపాకాయలు ఒకదాని తర్వాత ఒకటి కాల్చాలని అన్ని ఒకేసారి కాల్చవద్దు అన్నారు. టపాకాయలు కాల్చే ముందు దూరంను చూసుకోవాలని పేర్కొన్నారు. ఇంటిలోపట టపాకాయలు కాల్చవద్దని, బయట కాల్చాలన్నారు. మండే స్వభావంగాల ప్రాంతాల్లో టపాకాయలు కాల్చవద్దన్నారు. టపాకాయలు కాల్చినప్పుడు అనుకోకుండా సంఘటన జరిగితే వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలన్నారు. ఆనందంతో దీపావళి ఉత్సవాలలో జరుపుకోవాలని ఆ పశువులు దొరలకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ అగ్నిమాపక శాఖ అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.