07-04-2025 07:41:33 PM
తాడ్వాయి (విజయక్రాంతి): నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎంపీడీవో సాజిద్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని నర్సరీని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండలు ఎక్కువవుతున్నందున మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలో మొక్కలు బాగా పెరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.