19-02-2025 01:14:08 AM
మంథని, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంథని ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీలో జిల్లా మెడికల్ సూపరిండెంట్ శ్రీధర్ సూచించారు. సోమవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను సూపరిం డెంట్ శ్రీధర్ సందర్శించి ఇన్ పేషెంట్ ఔట్ పేషెంట్ సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని, ఆ నిధులను వినియోగిస్తూ ఆసుపత్రిలో 3 వార్డులలో మరమ్మత్తు పనులు చేపటి, మరమ్మత్తులను పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకోవచ్చమని, తెలిపారు.
మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంథని మెడికల్ సూపరిండెంట్ రాజశేఖర్ తో కలిసి సంద ర్శించి డయాలసిస్ కోసం ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా మంథనిలోనే సింగిల్ యూసెజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామన్నారు. డయాలసిస్ సేవలు అందుకుంటున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాక్ ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తెలిపారు. వారి వెంట సిబ్బంది, అధికారులు అన్నారు.