calender_icon.png 24 October, 2024 | 3:56 PM

నిమజ్జనంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

17-09-2024 03:49:01 AM

  1. మంత్రి పొన్నం ప్రభాకర్ 
  2. మేయర్, కమిషనర్, పీసీసీ చీఫ్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (విజయక్రాంతి): నగరంలో నేడు జరగనున్న గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హార్కర్ వేణుగోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు.

మంత్రి మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్లతో నిమజ్జనం తర్వాత వ్యర్థాలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, వాటర్ వర్క్స్ తదితర అంశాలపై మేయర్, కమిషనర్‌తో మంత్రి చర్చించా రు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్టు మేయర్ తెలిపారు. కాగా, అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.