calender_icon.png 7 November, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాలకు కేరాఫ్ కౌశిక్ రెడ్డి

07-11-2024 03:42:10 PM

దళితులను నయవంచన చేసింది కౌశిక్ రెడ్డి 

సమగ్ర కుల గణనన సర్వే దేశానికి ఆదర్శం

రైతులకు 500 బోనస్ ఇచ్చి తీరుతాం 

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు 

హుజరాబాద్ (విజయక్రాంతి): భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీణవంక మండలంలో సాక్షాత్తు ఎమ్మెల్యే తన అనుచరుడు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమెరికాలో ఉంటున్న శివ ప్రియ భూమి ఆక్రమాణ చేసి ఎమ్మార్వోను ఒత్తిడి చేసి సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో ఆపరేటర్ ఎమ్మార్వో సస్పెండ్ అయ్యారని అన్నారు.

ఓట్ల రాజకీయం కోసం దళిత బంధు రెండో విడత ఆపి దళితులను నయవంచ చేసింది కౌశిక్ రెడ్డి అని, రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉండి, ప్రభుత్వ విప్ గా ఉండి దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఇప్పుడు టెంట్ వేసుకొని కూర్చోవడం చంపినోడే సంతాపం తెలిపినట్టు ఉంటుందని ఎద్దేవ చేశారు. కౌశిక్ రెడ్డి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుందని, ఆలోచించలేదని, మరోసారి కౌశిక్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని త్వరలో రెండవవిడత దళిత బంధు అందజేస్తామని, దళారివ్యవస్థ లేకుండా చూస్తామని ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు సంభందించి అన్ని వివరాలు సమర్పించామని అన్నారు.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాహుల్ గాంధీ సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో, సమగ్ర కులగలన చేపడుతున్నమని ప్రతి ఒక్కరు తమ వివరాలను అధికారులకు తెలపాలని ప్రజలను కోరారు. వడ్లు కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఎమ్మెల్యే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 500 బోనస్ ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు నాయకులు  కోటి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, బాబుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.