28-04-2025 12:33:45 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ‘ది రోబోటిక్ ఎడ్జ్-2025’ పేరుతో ప్రత్యేక క్లినికల్ కాన్ఫరెన్స్‌ను హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వైద్య నిపుణులు, ఆరోగ్య రంగ ప్రముఖులు, టెక్నాలజీ పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా, ప్రముఖ నటి ప్రియాంక జవాల్కర్, ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్సులో రోబోటిక్ శస్త్రచికిత్స పద్ధతులను ప్రత్యక్షంగా చూపించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వల్ల ఆరోగ్య రంగంలో వచ్చే మార్పులపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. ‘కేర్ హాస్పిటల్ల్ రోబోటిక్స్‌ను వైద్య సేవల ముఖ్యమైన భాగంగా చూస్తున్నామన్నారు. ఇది శస్త్రచికిత్సలు ఇంకా ఖచ్చితంగా జరిగేలా చేసి, చికిత్సల ఫలితాలను మెరుగుపరుస్తుందన్నారు. జోనల్ సీవోవో బిజు నాయర్ మాట్లాడుతూ.. తమ డాక్టర్డు కొత్త సాంకేతికతలను స్వీకరించి, ఆరోగ్య రంగంలో మార్పుకు ముందుండి దారిచూపిస్తున్నారని చెప్పారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కేర్ వత్సల్య ఉమెన్ అండ్ చైల్ ఇనిస్టిట్యూట్‌లో క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ మంజుల ఆనగానీ రోబోటిక్ గైనకాలజీ గురించి మాట్లాడారు. కేర్ హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, హెచ్‌ఓడి- యూరాలజీ డాక్టర్ పి. వంశీకృష్ణ రోబోటిక్, లాపరాస్కోపీ, ఎండోయురాలజీ సర్జరీ గురించి వివరించారు.
సీనియర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సతీష్ పవర్ సర్జికల్ ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సీనియర్ కన్సల్టెంట్ జిఐ లాపరాస్కోపిక్ డాక్టర్ వేణుగోపాల్ పరిక్ బారియాట్రిక్, రోబోటిక్ సర్జరీ గురించి వివరించారు. కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో దాని అనుసంధానంపై ప్రసిద్ధ ఏఐ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభుని ప్రసంగించారు.
వైద్యులకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక సీఎంఈ క్రెడిట్ మంజూరైంది. కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్, గ్రూప్ సిఎఫ్‌ఓ విశాల్ మహేశ్వరి, గ్రూప్ సీఐవో వినోద్‌రామన్, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, జోనల్ సీఓఓ బిజు నాయర్, జోనల్ ఏవీపీ, మెడికల్ హెడ్ డాక్టర్ అజిత్ సింగ్ పాల్గొన్నారు.